● యజమానులు వెంటనే కూలీ ఒప్పందం చేపట్టాలి ● పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తిరంగంలోని కార్మికులు, వైపని, వార్పిన్, అనుబంధ రంగాలు, ఆసాములు కూలీ పెంచే వరకు పోరాడుతామని పలువురు స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక బీవైనగర్‌లో సోమవారం నిరవధిక సమ్మె శిబిరం ప్రారంభించారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల కూలి చర్చలు మాత్రమే జరిగినాయని అగ్రిమెంటు జరగలేదన్నారు. వార్పిన్, వైపని కూలీ చర్చలు జరగాల్సి ఉందన్నారు. కార్మికులు, ఆసాములు అందరి కూలి అగ్రిమెంట్ జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవర్‌లూమ్ కార్మికులకు 10 పిక్కులకు రూ. 0.28 పైసలు ఇస్తామని యజమానులు ఒప్పుకొని అగ్రిమెంట్ చేయలేదన్నారు. నాయకులు కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, కుడిక్యాల కనకయ్య, ఉడుత రవి, ఎలిగేటి శ్రీనివాస్, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్, బెజిగం సురేష్, సర్గం శేఖర్, గోవిందు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


