ఫిర్యాదుల పరిష్కారంతోనే పోలీస్‌శాఖపై నమ్మకం | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంతోనే పోలీస్‌శాఖపై నమ్మకం

Apr 28 2026 8:52 AM | Updated on Apr 28 2026 8:52 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గ్రీవెన్స్‌ డేకు 36 ఫిర్యాదులు

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గ్రీవెన్స్‌ డేకు 36 ఫిర్యాదులు

సిరిసిల్ల: ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును సానుకూలంగా స్వీకరించి ఆ సమస్యను పరిష్కరించాలని, అప్పుడే పోలీస్‌శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 36 మంది బాధితులు వచ్చారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మార్యదగా ప్రవర్తించాలని సూచించారు. సమస్య పరిష్కారమైతే పోలీస్‌శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును డీపీవో ఆఫీస్‌లో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు సమస్యలు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement