వెనకడుగు వేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వెనకడుగు వేయొద్దు

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

వెనకడుగు వేయొద్దు

పట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్‌ ఆఫీసర్‌గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్‌ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్‌లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్‌ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు.

– పృథ్వీరాజ్‌వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement