సిరిసిల్లటౌన్: కల్తీఆహారంపై ఉక్కుపాదం మోపుతామని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ హెచ్చరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఆహార భద్రత చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలు కల్తీ ఆహారంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. జిల్లా ఆహార భద్రత అధికారి అనూష మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల అథారిటీ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ)నిర్వహించే ఆహార భద్రత ప్రమాణాల గురించి వివరించారు. జిల్లా వెల్ఫేర్ అధికారి లక్ష్మీరాజం, ఆశాలు, అంగనవాడీ టీచర్లు పాల్గొన్నారు.


