ఆరు నెలల క్రితమే ఉద్యోగ విరమణ చేశాను. గ్రాట్యుటీ, ఈఎల్స్, జీపీఎఫ్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నాను. ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ముప్‌పై ఏళ్లకు పైగా ఉపాధ్యాయునిగా పనిచేశాను. గౌరవంగా రావాల్సిన బకాయిలు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగ విరమణ చేసిన నాలాంటి వారు ఆవేదనకు గురవుతున్నారు. – నందెల్లి రఘు,
విశ్రాంత ఉపాధ్యాయుడు, ముస్తాబాద్
జీవితకాలం ప్రజాసేవలో అంకితమై పనిచేసిన ఉద్యోగులకు, రిటైర్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రెండేళ్లుగా రిటైర్డ్ అయిన 500 మందికి ఒక్క రూపాయి రాలేదు. అందుకే సంఘంగా ఏర్పడి, ఉద్యోగుల హక్కు అయిన బకాయిలు సాధించేందుకు పోరాటం చేస్తున్నాం. మానవతా దృక్పథంతో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.– మల్లారపు పురుషోత్తం,
విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు


