ఇలా తవ్వారు.. అలా వదిలేశారు ! | - | Sakshi
Sakshi News home page

ఇలా తవ్వారు.. అలా వదిలేశారు !

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్‌ వద్ద తాగునీటి పైపులైన్‌ లీకేజీ ఏర్పడడంతో మరమ్మతుల కోసం అధికారులు నెల రోజుల క్రితం తవ్వారు. అక్కడ ప్రమాద హెచ్చరికబోర్డులు పెట్టి ఇలా వదిలేశారు. సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళ వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉండగా పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీరు లీకేజీ అవుతుండడంతో అందులో పిల్లలు దిగి ఆటలాడుతూ కలుషితం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement