సామాన్యుడి సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడి సొంతింటి కల సాకారం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

సామాన్యుడి సొంతింటి కల సాకారం ● జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ పేరెంట్స్‌ పే రెంటల్‌ చట్టం లోపాలు సవరించాలి యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల మంజూరు ఎల్‌ఎండీకి నీటి విడుదల

● జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌

సిరిసిల్ల అర్బన్‌: సామాన్యుడి సొంతింటి కల సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన ఎండీ మున్నీబేగం, రెహానా, నూర్జహాన్‌ బేగం ఇందిరమ్మ గృహప్రవేశాలకు హాజరయ్యారు. సిరిసిల్ల మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, కౌన్సిలర్‌ లాయక్‌ సుల్తానా తాజ్‌, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, దేవదాస్‌, తాజ్‌, రఫీక్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: పెరెంట్స్‌ పే రెంటల్‌ చట్టం–2026లోని లోపాలను ప్రభుత్వం సవరించాలని తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య కోరారు. సిరిసిల్లలోని వయోవృద్ధుల కేర్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కోడం నారాయణ, దేవదాస్‌, ఎల్లయ్య, జనపాల శంకరయ్య పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలో రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సిరిసిల్ల సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ బి.భిక్షపతి తెలిపారు. కేవలం ఐదు రోజుల్లోనే సుమారు 240 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 14,00 సర్వీసులు మాత్రమే మంజూరయ్యాయని, జూన్‌ నాటికి 2,160 పెండింగ్‌లో ఉన్న అన్ని సర్వీసులను మంజూరు చేస్తానమన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ఎల్‌ఎండీకి 2,000, కుడి కాలువకు 450, ఎడమ కాలువకు 5, మిషన్‌భగీరథకు 45 క్యూసెక్కుల మేర నీరు తరలుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement