ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత బాబు జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకెళ్దామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జగ్జీవన్‌రామ్ జయంతి ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. జగ్జీవన్‌రామ్ కూతురు మీరాకుమారి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న పాల్గొన్నారు.


