● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్/రుద్రంగి: పుణ్యక్షేత్రం నుంచి మరో పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సులను ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాళేశ్వరం, యాదగిరిగుట్టకు బస్సులను శనివారం ప్రారంభించి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మా ట్లాడి వేములవాడకు, సిరిసిల్ల, మెట్‌పల్లి, జగిత్యా ల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుంచి బస్సు స ర్వీసులు పెంచాలని కోరినట్లు తెలిపారు. వేములవాడ బస్టాండ్ ఆధునికీరణకు రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట బస్సుస్టేషన్లను ఆధునికరిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ పు ల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమి టీ చైర్మన్ రొండి రాజు, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కౌన్సిలర్ ఎల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో సురక్షిత సమాజం
సీసీ కెమెరాలతో సురక్షిత సమాజం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మార్గం గోపిని అభినందించారు. డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్ పాల్గొన్నారు.


