ఫోన్‌లోనే వ్యూహం
న్యూస్‌రీల్
ద్వితీయశ్రేణి నాయకులతోనే పావులు కదుపుతున్న నేతలు బుజ్జగింపులు.. భవిష్యత్‌పై ఆశలు ఇప్పటికే 27 గ్రామాలు ఏకగ్రీవం రేపు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ఊపందుకున్న ప్రచారం
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మూడో విడతలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అయితే ఈసారి ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూరంగా ఉంటున్నారు. ద్వితీయశ్రేణి నాయకులతో మంతనాలు జరుపుతూ ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నారు. పోటీలో నుంచి ఉపసంహరించుకుంటే భవిష్యత్ రాజకీయ జీవితంపై భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 27 గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. కానీ బడా నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
కనిపించని బడా నేతలు
వేములవాడ నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 9న జరగనున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ పార్టీ శ్రేణులతో ఫోన్‌లో మాట్లాడుతూ దిశ, నిర్దేశం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చలిమెడ లక్ష్మీనరసింహారావు కేరళలో ఉన్నారు. నిత్యం పార్టీ నాయకులతో ఫోన్‌లోనే సమాలోచనలు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రాంతంలోని ప్రధాన పార్టీల నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పంచాయతీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్యనాయకులతో వ్యూహాలు రూపొందిస్తున్నారు. సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డి సైతం పార్టీ శ్రేణులతో టచ్‌లో ఉంటూ అభ్యర్థులను ఖరారు చేశారు.
ఏకగ్రీవాలపై నజర్
మూడో విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉంది. ఆయా మండలాల్లోని జీపీలను ఏకగ్రీవం చేసేందుకు బడా నేతలు పావులు కదుపుతున్నారు. ద్విముఖ, త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ఏకగ్రీవం చేసేందుకు నామినేషన్ల ఉపసంహరణ పర్వాన్ని వేదిక చేసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు ఆయా మండలాల్లోని ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు పోటీలో ఉన్న అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులతో ముఖ్యనేతలతో ఫోన్‌లో మాట్లాడిస్తూ భవిష్యత్‌లో పదవులు ఇస్తామని, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని హామీలు ఇప్పిస్తున్నారు. ఆర్థికపరమైన భేరాలు చేస్తున్నారు.
ఏకగ్రీవమైన 27 గ్రామాలు
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామాలకు 27 పంచాయతీల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 295 వార్డుస్థానాల్లోనూ ఒక్కో నామినేషన్ రావడంతో ఆ వార్డు సభ్యులు ఏకగీవ్రమయ్యారు. జిల్లాలో 233 సర్పంచ్ స్థానాలకు, 1973 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మూడో విడత గ్రామాల్లో ఉపసంహరణకు మంగళవారం వరకు గడవు ఉండడంతో మరిన్న ఏకగీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో ఎనిమిది గ్రామాలు, రుద్రంగిలో ఏడు, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేటల్లో రెండు, గంభీరావుపేట, తంగళ్లపల్లిల్లో మూడు, ముస్తాబాద్, వీర్నపల్లిల్లో ఒక్కో గ్రామం ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి.
నాలుగు మండలాల్లో ఆఖరు ప్రయత్నాలు
నామినేషన్ల ఉపసంహరణకు
రేపటి వరకు గడువు ఉండడంతో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ప్రధాన పార్టీల నేతలు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై నజర్ పెట్టి, ఆయా పల్లెల్లో రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు చివరి ప్రయత్నాలు ప్రారంభించాయి. ద్వితీయ శ్రేణి నాయకులను రంగంలోకి దింపాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లె పోరు రసవత్తరంగా సాగుతుంది.
ప్రచారంలో
దూరం..
ఫోన్‌లోనే వ్యూహం
ఫోన్‌లోనే వ్యూహం
ఫోన్‌లోనే వ్యూహం
ఫోన్‌లోనే వ్యూహం


