అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

● జిల్లా ఎంసీసీ శేషాద్రి

వేములవాడరూరల్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ ఆదివారం పరిశీలించారు. వేములవాడ రూరల్‌ మండలంలోని జిల్లా సరిహద్దు ఫాజుల్‌నగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు.

ఎన్నికల నియమావళి పాటించాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ప్రవర్తన నియామవళి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) ఎంసీసీని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎంసీసీ అధికారి, సిరిసిల్ల డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. తంగళ్లపల్లిలోని రైతువేదికలో జిల్లా సహాయ ఎన్నికల అధికారి తంగళ్లపల్లి ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సర్పంచ్‌, వార్డుసభ్యుల అభ్యర్థులకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌పై ఆదివారం అవగాహన కల్పించారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ బడులు, గుడులు, ప్రార్థన మందిరాల్లో ప్రచారం చేయొద్దని సూచించారు. కులాలు, మతాలు, వర్గాల పేరుతో ఓట్లు అడగకూడదని స్పష్టం చేశారు. ఖర్చుచేసే ప్రతీ రూపాయికి లెక్క చూపించాలన్నారు. రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉండొద్దని, మద్యం ఆరు ఫుల్‌బాటిళ్లు, 12 బీరుసీసాలకు మించి ఇంటిలో ఉంటే సీజ్‌చేసి కేసు నమోదు చేస్తారని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదవుతాయన్నారు. ఏవో సంజీవ్‌, ఏపీవో నాగరాజు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పో టీలకు ఎంపికయ్యారు. సాకేత్‌, ఉమేశ్‌ కబడ్డీ స్టేట్‌ లెవెల్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ వీర ప్రభాకర్‌ తెలిపారు. ఈనెల 6, 7, 8 తేదీలలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఉద్యోగుల నిరీక్షణ

కోనరావుపేట(వేములవాడ): మండల పరిషత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. తమ ఓటుహక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకునేందుకు పలువురు ఉద్యోగులు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కోనరావుపేట మండల పరిషత్‌కు చేరుకున్నారు. అయితే అధికారులు ఎవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌ నిర్వహించిన సమావేశానికి వెళ్లిన మండల పరిషత్‌ అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల అధికారి కల్పన, ఇతర సిబ్బంది ఉద్యోగుల నుంచి పోస్టల్‌ బ్యాలెట్లను స్వీకరించారు. మొత్తం 11 మంది ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.

ఆత్మహత్యలు సరికాదు

సిరిసిల్లటౌన్‌: ఆత్మహత్యలు సరికాదని బీసీ రిజర్వేషన్లు పోరాడి సాఽధించుకుందామని పలువురు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో ఆదివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో సాయి ఈశ్వరాచారి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఇప్పటికై నా కేంద్రం స్పందించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంతం రవి, బొజ్జ కనకయ్య, బుర్ర మల్లేశం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, సోమ నాగరాజు, రజని, సాగర్‌, రాకేశ్‌, రాజు, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement