చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. క్రీడలతో మానసికోల్లాసంతోపాటు శారీరక ద్రుఢత్వం లభిస్తుందన్నారు. పట్టణంలో రాష్ట్రస్థాయి ఓపెన్ కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలను ఆదివారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో విద్యార్థులు రాణించాలన్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదిరించేలా క్రీడలు మానసిక ధ్రుఢత్వాన్ని కల్గిస్తాయన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు నేరెళ్ల శ్రీధర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలన
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీ లించారు. భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సీసీ రోడ్డు, క్యూలైన్, ఫ్లైఓవర్, ఉచిత దర్శనం క్యూలైన్, రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్, వీఐపీ రోడ్డు, పార్వతీపురం ధర్మశాల రోడ్డు, లడ్డూ కౌంటర్, కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపుల పనులు పరిశీలించారు.


