ఆకలితో వినలేకపోతున్నం
ఉదయం స్కూల్‌కు వచ్చి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తున్నాం. నెల క్రిత నుంచి స్నాక్స్ ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆకలితో క్లాసులు సరిగా వినలేకపోతున్నాం. ఇంటికి వెళ్లే సరికి ఆలస్యమవుతోంది. – రుచిత, పదో తరగతి
సాయంత్రం తరగతులు పూర్తయి బస్సులో ఇంటికెళ్లే సరికి రాత్రి అవుతుంది. అప్పటికే అలసిపోతున్నాం. సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తే బాగుండేది. ఆకలితో క్లాసులు అర్థం కావడం లేదు.
– భరత్, వెంకయ్యకుంట
నవంబర్ 1 నుంచే గోరుముద్ద ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా బడ్జెట్‌రాలేదు. పిల్లలు ఆకలి అంటున్నారు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. నిధులు రాగానే పిల్లలందరికీ స్నాక్స్ ఇస్తాం.
– నిమ్మ రాజిరెడ్డి, ఎంఈవో, ముస్తాబాద్
ఆకలితో వినలేకపోతున్నం
ఆకలితో వినలేకపోతున్నం


