
అమెరికాకు నౌకలో వెళ్లాను
ముస్కానిపేట నుంచి మొదటిసారిగా 1961లో అమెరికాకు వెళ్లాను. చేతిలో కొంత డబ్బు ఉండడంతో విశాఖపట్నంలో నౌక ఎక్కి అమెరికాకు వెళ్లాను. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ వచ్చింది. ఉద్యోగంలో స్థిరపడ్డాను. తిరిగి ఐదేళ్లకు గ్రామానికి రాగా డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. ఇద్దరు తమ్ముళ్లు బాపురెడ్డి, మోహన్‌రెడ్డిలను అమెరికాకు తీసుకెళ్లాను. నాకు ఇద్దరు కూతుళ్లు. అమెరికాలో స్థిరపడ్డారు. మా కుటుంబానికి అందరికీ గ్రీన్‌కార్డ్స్ ఉన్నాయి. కనెక్టికట్ స్టేట్‌లో నివాసం ఉంటున్నాం. మా తమ్ముడు బాపురెడ్డిని ఇల్లంతకుంట మండలంలో అమెరికా బాపురెడ్డి అని పిలుచుకుంటారు.
– కోమటిరెడ్డి నరసింహారెడ్డి