అటు వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

అటు వసూళ్లు!

Oct 22 2025 6:47 AM | Updated on Oct 22 2025 6:47 AM

అటు వసూళ్లు!

అటు వసూళ్లు!

సిరిసిల్ల డీఆర్డీవోలో వసూల్‌ రాజా

కొనుగోలు కేంద్రానికి రూ.3 వేలు

ధాన్యం లెక్కల పేరిట అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి చేతివాటం

ఇప్పటికే రూ.2.34 లక్షలు వసూలు

ఇటు కొనుగోళ్లు..

సిరిసిల్ల: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యా యి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత రబీ సీజన్‌లో జిల్లాలో ధాన్యం సేకరణ జరిగింది. ఇందిరక్రాంతి పథం (ఐకేపీ) ద్వారా మహిళా సంఘాలు ధాన్యం సేకరణలో ముందున్నాయి. కాగా, అప్పటి ధాన్యం సేకరణలో రీకన్సలేషన్‌ పేరిట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేసే ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఒక్కో ధా న్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద రూ.3వేలు చొప్పున వసూలు చేస్తున్నాడు. రబీ సీజన్‌లో జిల్లాలో 192 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని మహిళా సంఘాలకు అప్పగించారు. ఆయా కేంద్రాలను నిర్వహించిన బాధ్యుల నుంచి ఇప్పుడు ఈ వసూళ్ల పర్వం సాగుతోంది. జిల్లాలోని 78 కేంద్రాల వద్ద రూ.3 వేల చొప్పున రూ.2.34 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

ఏం జరిగిందంటే..

జిల్లా వ్యాప్తంగా యాసంగి (రబీ సీజన్‌) ధాన్యం కొ నుగోలు కోసం 243 కేంద్రాలను ప్రారంభించా రు. ఇందులో 190 కేంద్రాలను మహిళా సంఘాల కు డీ ఆర్‌డీఏ ద్వారా అప్పగించారు. 2025 ఏప్రిల్‌ మొ దటి వారంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి, రెండు నెలల పాటు శ్రమించి రైతుల శ్రమఫలాన్ని పూర్తి స్థాయిలో సేకరించారు. 190 కేంద్రాల్లో 32,556 మంది రైతుల నుంచి రూ.470 కోట్ల వి లువైన 2.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మహిళా సంఘాలు సేకరించిన ధా న్యానికి సంబంధించి రూ.6కోట్ల మేరకు కమీషన్‌ డ బ్బులు సంఘాలకు రావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రీకన్సలేషన్‌ పేరిట ఇప్పుడు వసూళ్లు చేస్తున్నారు. అప్పట్లో ఽకేంద్రాల బాధ్యతలు తీసుకున్న సెంటర్‌ ఇన్‌చార్జీలు, ఐకేపీ సీసీలు, బుక్‌ కీపర్ల వద్ద రీకన్సలేషన్‌ పేరిట అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి బహిరంగగానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు రూ.3వేలు చొప్పున డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విషయం బయటకు పొక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement