
శృంగేరి స్వామిజీ సూచనల మేరకే ఆలయ అభివృద్ధి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి సూచనల మేరకే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఆలయ చైర్మన్ చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతి మహాస్వామి దివ్యసాన్నిథ్యంతో క్షేత్రం మరింత పవిత్రతను సంతరించుకుందని, ఆధ్యాత్మిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శృంగేరి స్వామిజీ ఆలోచనలకు అనుగుణంగానే అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.