అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
పెరుగుతున్న మద్యం దరఖాస్తులు
సిరిసిల్లక్రైం: జిల్లాలోని 48 మద్యం దుకా ణాలకు నిర్వహిస్తున్న టెండర్లలో దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొదట నిర్ణయించిన 18వ తేదీ వరకు 1,324 దరఖాస్తులు రాగా ఈనెల 23 వరకు గడువు పొడగించా రు. బుధవారం మరో 9 దరఖాస్తులు అందిన ట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. 23వ తేదీతో గడువు ముగియనుండడంతో ఆశా వహుల నుంచి మళ్లీ ధరఖాస్తులు వస్తాయన్న ఆశాభావంతో ఆబ్కారీ అధికారులు ఉన్నారు.
జిల్లా భూసర్వే ఏడీగా శ్రీనివాస్
సిరిసిల్ల: జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా వి.శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఏడీ వెంకట్‌రెడ్డి పనిచేశారు. ఆయన స్థానంలో మంచి ర్యాల జిల్లా ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను జిల్లా ఇన్‌చార్జి ఏడీగా నియమించారు. గతంలో శ్రీనివాస్ తొమ్మిదేళ్లపాటు సిరిసిల్ల డివిజన్‌లో పనిచేశారు. జిల్లా ఆవిర్భాంతో ఏడీగా పని చేసి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి ఏడీగా నియమితులైన శ్రీనివాస్‌ను జిల్లా సీనియర్ లైసెన్స్ సర్వేయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి బి.ఎల్లం, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు విజయేందర్‌రెడ్డి, రామాంజనేయులు, శ్రీకాంత్, ప్రవీణ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
విద్యార్థుల వివరాలు సరిచూడండి
సిరిసిల్లఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా అవసరమైన అన్ని వివరాలతో పాఠశాల యాజమాన్యాలు సంసిద్ధంగా ఉండాలని జిల్లా పరీక్షల నియంత్రణ సహాయాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో సరిచూడాలని, ఏదేని పొరపాట్లు జరిగితే నిర్ణీత నమూనాలో జిల్లా విద్యాధికారి ద్వారా సరిచేసేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులు మనోహర్‌రెడ్డి రాష్ట్ర పరీక్షల బోర్డు నిబంధనలు వివరించారు.
అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు


