
ప్రతి నెలా కమీషన్ ఇస్తే ఇబ్బంది ఉండదు
ప్రతి నెలా కమీషన్ ఇస్తే ఇబ్బంది ఉండదు. ఏప్రిల్ నెల నుంచి కేంద్రం బియ్యం కమీషన్, సెప్టెంబరు, అక్టోబరు నెలల రాష్ట్ర కమీషన్ పెండింగ్‌లో ఉంది. దీంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ, పౌరసరఫరాల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. మా రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.
– రెడ్డిమల్ల హన్మయ్య, రాష్ట్ర రేషన్ డీలర్ల
సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి
ప్రతి నెలా రేషన్‌బియ్యం సరఫరా, పంపిణీ సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. రేషన్‌డీలర్లకు చెల్లించాల్సిన కమీషన్ అంశం మా పరిధిలో లేదు. నేరుగా రాష్ట్రస్థాయి నుంచి రేషన్ డీలర్లకు కమీషన్ డబ్బులు జమవుతాయి. మా వద్ద ఎలాంటి నివేదికలు పెండింగ్‌లో లేవు. రేషన్‌డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ స్థాయిలో కమీషన్ అంశం పరిశీలనలో ఉంది.
– బాదాం చంద్రప్రకాశ్,
జిల్లా పౌరసరఫరాల అధికారి

ప్రతి నెలా కమీషన్ ఇస్తే ఇబ్బంది ఉండదు