కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధర
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్/కోనరావుపేట/చందుర్తి(వేములవాడ): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కోనరావుపేట మండలం కనగర్తిలో ప్యాక్స్, వట్టిమల్లలో ఐకేపీ, వేములవాడ మండలం అనుపురం, చందుర్తి మండలం సనుగులలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి ప్రారంభించారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 అదనంగా బోనస్ అందిస్తామన్నారు. కోనరావుపేట మండలం మూలవాగు, పెంటివాగుపై బ్రిడ్జీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య, వైస్ చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, ప్యాక్స్ చైర్మన్ బీరెడ్డి సల్మాన్‌రెడ్డి, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం పాల్గొన్నారు.


