కష్టాలు తీరలే!
ప్రజాపంపిణీ స్వరూపం
ఇబ్బందులు లేకుండా పనులు చేపడతాం
పరేషాన్‌లో రేషన్‌డీలర్లు
ఏడు నెలలుగా ఎదురుచూపులే..
నెలకు రూ.4.99 కోట్ల కమీషన్ పెండింగ్
నిర్వహణ భారంతో ఇబ్బందుల్లో డీలర్లు
ఆలయం ఎదుట ప్రచార రథం, ఎల్‌ఈడీ స్క్రీన్
భీమన్నగుడిలో దర్శనాలు, కోడెమొక్కులు
ఓపెన్ హౌస్.. వెపన్ షో
ఆయుధాలతో విద్యార్థులు
నిందితుల రికార్డ్స్ వివరాలు తెలుపుతున్న అధికారి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. పోలీస్ బలగాలు ఉపయోగించే ఆయుధాలను ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఓపెన్‌హౌస్‌లోని ఆయుధాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. వాటిని పట్టుకొని ఆనందించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల
కమీషన్ రాలే..
సిరిసిల్ల: అందరికీ బియ్యం పంపిణీ చేసే రేషన్ డీలర్లు కమీషన్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి, రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కమీషన్ రాక కష్టాల్లో ఉన్నారు. పిల్లల చదువులకు ఫీజులు.. దుకాణాల అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఒకే సారి మూడు నెలల కోటా బియ్యం పంపిణీ చేసే శభాష్ అనిపించుకున్నామే తప్ప ఆర్థిక కష్టాలు తీరలేవని వారు వాపోతున్నారు. దానికితోడు ఇటీవల ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం పంపిణీ చేయడం తలకుమించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో రేషన్‌డీలర్ల కమీషన్ కష్టాలపై ఫోకస్.
క్వింటాల్‌కు రూ.140 కమీషన్
రేషన్ డీలర్లు ఒక్క క్వింటాలు బియ్యం పంపిణీ చేస్తే రూ.140 కమీషన్ వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.90, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 చెల్లిస్తుంది. గత ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కమీషన్, రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కమీషన్ పెండింగ్‌లో ఉంది. జిల్లా వ్యాప్తంగా 345 మంది రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఒక్కో డీలర్‌కు వేలల్లో బకాయి
ఏడు నెలలుగా రేషన్ డీలర్లకు కమీషన్ రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సగటున ఒక్కో రేషన్‌డీలర్ వంద క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తే నెలకు వచ్చే కమీషన్ రూ.14వేలు. ఇందులో హమాలీ చార్జీలు, గుమస్తా జీతం చెల్లించాల్సి ఉంది. నెలకు కేంద్రం కమీషనర్ రూ.9వేలు, ఏడు నెలలుగా రూ.63వేలు, రాష్ట్రం కమీషన్ రెండు నెలలది కలిపి రూ.28వేలు ఇలా.. ఒక్కో డీలర్‌కు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.91వేలు కమీషన్ రావాల్సి ఉంది. వంద క్వింటాళ్ల కంటే తక్కువ పంపిణీ చేస్తే తక్కువ కమీషన్ వస్తుంది. ఎక్కువ పంపిణీ చేస్తే ఇంతకంటే ఎక్కువ వస్తుంది. మరో వైపు హమాలీ చార్జీలు, షాపు అద్దెలు పెరగడం, గోదాముల నుంచి వచ్చే బియ్యం బస్తాల్లో తూకం సరిగా లేక తరుగును రేషన్ డీలర్లు భరించాల్సి వస్తోంది.
ఇవీ డిమాండ్లు
● గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 వరకు ఏడు నెలలుగా కేంద్రం బియ్యం పంపిణీ కమీషన్, సెప్టెంబర్, అక్టోబర్ రాష్ట్ర ప్రభుత్వ కమీషన్ వెంటనే విడుదల చేయాలి.
● భవిష్యత్‌లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ కమీషన్లను వేర్వేరుగా కాకుండా, ఒకేసారి డీలర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి.
● ప్రస్తుతం షాపుల్లో ఉన్న పాడవుతున్న దొడ్డుబియ్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
రాజన్న ప్రధానాలయం ప్రహరీని కూల్చుతున్న జేసీబీ
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు జో రందుకున్నాయి. బుధవారం ప్రధాన ఆలయంలో పలు నిర్మాణాల తొలగింపులు మొదలయ్యాయి. ప్రధాన ఆలయం ప్రహరీ, రేకులషెడ్లను తొలగిస్తున్నారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి ఈనెల 20న రాజన్నను దర్శించుకున్న సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. ఈనేపథ్యంలో పనులను అధికారులు మొదలుపెట్టారు. ఆలయంపై ఏర్పాటు చేసిన పై అంతస్తు రేకులు తొలగిస్తున్నారు. ప్రహరీ, నిత్యనివేదనశాల కూల్చివేతలు ప్రారంభించారు.
ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో..
ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారుల బృందం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల దర్శనాలకు ఆటంకాలు లేకుండా పనులు చేపట్టారు.
ప్రచార రథం, ఎల్‌ఈడీ స్క్రీన్
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం ఆలయ ఆవరణలో కల్పించేందుకు తూర్పు దిశలో ప్రచార రథం, ఎల్‌ఈడీ స్క్రీన్‌ను బుధవారం ఏర్పాటు చేశారు. కాసేపు దర్శనాలకు బ్రేక్ ఇచ్చిన సమయంలో భక్తులు ప్రచారరథం వద్ద స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, ఆర్జితసేవలు, కోడెమొక్కులు కొనసాగుతున్నాయి.
కట్టపైకి కల్యాణకట్ట
ఆలయం ముందు గల కల్యాణకట్టను ఇటీవల కూల్చివేశారు. ప్రస్తుతం రాజేశ్వరపురం కట్టపైన గతంలో వాహనాల పూజ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులోకి మార్చారు.
గ్రామాలు : 260, రేషన్ షాపులు : 345
రేషన్‌కార్డులు : 1,77,851
అంత్యోదయ కార్డులు : 13,748
అంత్యోదయ అన్నయోజన
కార్డులు : 203
రేషన్ బియ్యం లబ్ధిదారులు : 5,35,920
ప్రతీ నెల సరఫరా అయ్యే బియ్యం : 3,565 మెట్రిక్ టన్నులు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపడతాం. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఆలయ విస్తరణ పనుల సమయంలో దర్శనాల కోసం రాజన్న ఆలయం ఎదుట ప్ర చారరథం, ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశాం. భీమన్నగుడిలో దర్శనాలు, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు కొనసాగుతాయి.
– రమాదేవి, ఆలయ ఈవో
కష్టాలు తీరలే!
కష్టాలు తీరలే!
కష్టాలు తీరలే!
కష్టాలు తీరలే!
కష్టాలు తీరలే!
కష్టాలు తీరలే!


