
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట/చందుర్తి: జిల్లాలో పలుచోట్ల సోమవారం వేకువజామున కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని కేంద్రంలో ధాన్యం తడిసిపోగా, మద్దతు ధరకే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఇల్లంతకుంట మండలం కేంద్రంతోపాటు పెద్దలింగాపురం, గాలిపెల్లి, రేపాక, పొత్తూరు, జంగారెడ్డిపల్లె, అనంతారం తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చందుర్తి మండలం దేవునితండా, సనుగుల గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడవగా ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందిపడ్డారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం