ఒంగోలు కోర్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయక మండపంలో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
వినాయక చవితి పర్వదినం సందర్భంగా మహాగణపతిని వివిధ రూపాల్లో కొలుస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో విశేష అలంకరణలతో స్వామిని తీర్చిదిద్ది పూజిస్తున్నారు. ఒంగోలు దక్షిణం బజారులో 2,11,000 పెన్నులతో 42 అడుగుల భారీ విద్యాగణపతిని ఏర్పాటు చేయగా గోపాల్‌నగర్ 4వ లైనులో చాక్లెట్స్, చిప్స్ ప్యాకెట్లతో, త్రిపురాంతకంలోని బ్రహ్మంగారి కాలనీలో రూ.1.20 లక్షల విలువైన 60 వేల గాజులతో వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


