వైఎస్‌ జగన్‌ సీఎం కావాలంటూ పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలంటూ పాదయాత్ర

Aug 2 2026 2:04 AM | Updated on Aug 2 2026 2:04 AM

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలంటూ పాదయాత్ర

పీసీపల్లి: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2029లో ముఖ్యమంత్రి కావాలని, కనిగిరి ఎమ్మెల్యేగా డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ గెలవాలని కోరుకుంటూ పీసీపల్లి మండలం గుదేవారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు రేగుల బాలయ్య చౌదరి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు పీసీపల్లి నుంచి తిరుమల వరకు పాదయాత్రను శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన నెలకుర్తి నాగేశ్వరరావు చౌదరి, కుందురు నాగేశ్వరరావు చౌదరి, మన్యం వెంకట్రావు చౌదరి, మక్కిన బాలకష్ణ చౌదరి, ఏనుగంటి నవీన్‌ చౌదరి, రేగుల సుధాకర్‌ చౌదరి, ఏనుగంటి రవి చౌదరి, రేగుల బాలాజీ చౌదరి, ఎడ్ల తేజ చౌదరి, చెందిన కొంతమంది యువకులు చేస్తున్న పాదయాత్రను పాలేటి గంగమ్మ ఆలయం వద్ద నుంచి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు బాగుండాలని కోరుకున్నారు. పాదయాత్ర ఎనిమిది రోజులు పాటు జరుగుతుందని వారు తెలిపారు. దద్దాల నారాయణ యాదవ్‌ ను ఆలయ పూజారులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గోపవరపు బొర్రా రెడ్డి, ఓకే రెడ్డి, పోలు జయరాం రెడ్డి, యారవ నరసింహం చౌదరి, జీ ఆదినారాయణ రెడ్డి, ఎర్రం రెడ్డి మోహన్‌ రెడ్డి, చెన్నుపాటి వెంకట్రావు చౌదరి, భూమిరెడ్డి కొండారెడ్డి, వాకమల్ల రాజశేఖర్‌ రెడ్డి, సుదర్శనం, మాలి, శ్రీకాంత్‌, నారాయణ, రవి, నజీర్‌ భాష, శ్రీను, గొబ్బిళ్ళ శ్రీనివాస్‌ యాదవ్‌, రాజారెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement