ఒంగోలు సబర్బన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్)పై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. బుధవారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్–2026)పై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని, క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వర్చువల్ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాధురి పాల్గొన్నారు.


