ప్రభకు బూచేపల్లి వెంకాయమ్మ పూజలు | - | Sakshi
Sakshi News home page

ప్రభకు బూచేపల్లి వెంకాయమ్మ పూజలు

Mar 24 2026 6:57 AM | Updated on Mar 24 2026 6:57 AM

చీమకుర్తి: రామతీర్థం తిరునాళ్ల సందర్భంగా వైఎస్సా ర్‌ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న విద్యుత్‌ ప్రభకు సోమవారం చీమకుర్తిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ పూజలు చేశారు. మరో వారం రోజుల్లో జరగనున్న తిరునాళ్ల సందర్భంగా ప్రభ తడికను నిర్మిస్తున్నందున ప్రభ వద్దకు వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించి ప్రభకు పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, వైస్‌ ఎంపీపీ బాపతు వెంకటరెడ్డి, పార్టీ నాయకులు గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, సోమా శేషాద్రి, బడే అయ్యపరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement