● ఒకరు మృతి
బల్లికురవ: కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మేదరమెట్ల – నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న టి.సుబ్రమణ్యం (53) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి, డ్రైవర్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


