నేలకొరిగిన అరటి పంట | - | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన అరటి పంట

Mar 22 2026 2:04 AM | Updated on Mar 22 2026 2:04 AM

పెద్దారవీడు:

మండల కేంద్రమైన పెద్దారవీడులో శుక్రవారం అకాల వర్షం, ఈదురు గాలులు కారణంగా అరటి చెట్లు నెలకొరిగాయి. గ్రామానికి చెందిన రైతు అల్లు వెంకటరెడ్డి సాగు చేసిన 2 ఎకరాల అరటి పొలంలో సాగు చేశానని, పంట చేతికి అందే సమయంలో వడగండ్ల వర్షంతో పాటు ఈదురు గాలులు ఎక్కువగా రావడంతో పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 చెట్లు నేలకు కూలడంతో దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రస్తుతం అరటి పంట పూత, కాయ దశలో ఉంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి అదుకోవాలని రైతు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement