మూలనబడి | - | Sakshi
Sakshi News home page

మూలనబడి

Nov 14 2025 8:59 AM | Updated on Nov 14 2025 9:01 AM

జెడ్పీ స్కూలు అధికారులపై

కలెక్టర్‌ అసహనం

సర్కారు బడుల్లో నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్లు శుద్ధ జలం కోసం విద్యార్థుల అగచాట్లు అనారోగ్యం బారిన పడుతున్న వైనం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో బడుల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు వాటిని గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపయోగంగా మారిన ప్లాంట్లు బడుగులేరు జెడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్‌ అధికారుల తీరుపై అసహనం

శుద్ధజలం

కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు శుద్ధ జలం అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం

అధికారంలోకి వచ్చాక వాటి

పర్యవేక్షణను గాలికొదిలేసింది.

ఫలితంగా చాలా స్కూళ్లలో సురక్షిత నీటిని అందించే యంత్రాలు

నిరుపయోగంగా మారాయి.

విద్యార్థులు తాగేందుకు స్వచ్ఛమైన జలాలు అందడం లేదు. చిన్నారులు సురక్షితం కాని నీటినే తాగాల్సి

వస్తోందని తల్లిదండ్రులు

వాపోతున్నారు. ఇదిలా ఉండగా

ఇటీవల కనిగిరి మండలం

బడుగులేరులో విద్యార్థులు

అస్వస్థతకు గురైన పాఠశాలను

గురువారం కలెక్టర్‌ సందర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

కనిగిరి రూరల్‌: జిల్లాలోని 38 పాఠశాలల్లో 2,400 ప్రభుత్వ పాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 2 లక్షల 35 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యా రంగంపై, ప్రత్యేకించి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల పట్ల దృష్టి సారించింది. అందులో భాగంగానే నాడు–నేడు పథకం ద్వారా సర్కార్‌ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. ప్రధానంగా మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, తాగునీరు (సురక్షిత జలాలు) అందించే ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పథకం ఫస్ట్‌ ఫేజ్‌ కింద దాదాపు 1,015 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నాడు–నేడు పథకం ఫేజ్‌–1 కింద ఎంపికై న ప్రతి పాఠశాలకు రూ.35 వేల నుంచి రూ.4.50 లక్షల ఖరీదు చేసే (టైప్‌ 1 నుంచి టైప్‌ 4 వరకు అంటే.. 5 లీటర్ల నుంచి 100 లీటర్ల శుద్ధ జలాల) ఆర్వో ప్లాంట్లను మంజూరు చేసింది. 2021–22లో ఏర్పాటు చేసిన ఈ ఆర్వో ప్లాంట్ల వారంటీ 2 లేదా 3 ఏళ్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శుద్ధ జలాలు అందించే ఆర్వో ప్లాంట్ల పర్యవేక్షణను గాలికొదిలేసింది. దీంతో ఏదో ఒకటీరెండు చోట్ల తప్ప దాదాపు అన్ని ఆర్వో ప్లాంట్లు మూలనపడ్డాయి. జిల్లా స్థాయి అధికారులు సైతం వీటిని పట్టించుకోకపోవడంతో విద్యార్థులు సురక్షితంకాని నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఆర్వో ప్లాంట్‌ కంపెనీలతోగానీ, ఎస్‌ఎస్‌ఏ అధికారులతోగానీ, విద్యాశాఖ ఉన్నతాధికారులతోగానీ చర్చించి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన జలాలు కరువయ్యాయి. కొన్ని చోట్ల బోర్ల నీరు, మరికొన్ని చోట్ల ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లలోని నీటిని తాగుతున్నారు. అయితే, ఆ ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లలోని నీటిలో భద్రత ఎంత.. సురక్షితం ఏ మేరకు అన్నది కూడా ప్రశ్నార్థకమే.

బడుగులేరు ఘటనతో ఆందోళనలు...

బడుగులేరు ఎస్సీకాలనీ విద్యార్థులకు వాంతులు, విషజ్వరాలు, కామెర్లు రావడం నీటి కాలుష్యం వలనే జరిగిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ కాలనీలోని డీప్‌ బోర్‌ వెల్‌ నీటి కలుషితంగా గుర్తించి తక్షణం ఆ ప్రాంతంలోని బోర్‌ను సీజ్‌ చేశారు. స్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ సైతం పనిచేయక మూలనపడింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రైవేట్‌ ఆర్వో ప్లాంట్‌ నీటిని తెప్పిస్తున్నారు. అయితే, ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లోని నీటిలో నాణ్యతా ప్రమాణాలపై కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 9 మంది విద్యార్థులు వాంతులు, విషజ్వరం, కామెర్లతో అనారోగ్యం పాలవడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే మా పిల్లల ఆరోగ్యానికి రక్షణ ఏదని అధికారులను నిలదీస్తున్నారు.

అధికారుల్లో కదలిక...

కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, విద్యా శాఖ, హెల్త్‌ అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ మేరకు డీఎల్‌డీఓ శ్రీనివాసులరెడ్డి, పాఠశాలల ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లోని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు, డీప్‌ బోర్‌వెల్స్‌లోని వాటర్‌ శాంపిల్స్‌ సేకరించాలని ఆదేశించారు. ఆ నీటిలోని నాణ్యతా ప్రమాణాలు, ఫ్లోరైడ్‌, నీటి కలుషితం తదితర అంశాలను పరిశీలించి తక్షణం నివేదికలు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో పరిశుభ్రత, ఎండీఎంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎల్‌డీఓ సూచించారు.

వ్యాధుల బారిన పడే ప్రమాదం...

ప్రతిరోజూ ఒక మనిషి కనీసం 5 లీటర్ల నీటిని, చిన్నారులు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలనే వైద్యుల సలహాలు, సూచనలు నీరుగారుతున్నాయి. దీంతో విద్యార్థుల్లో నీటి శాతం తగ్గి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షా కాలంలో కలుషితమైన నీరు తాగడం వలన విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో బయట వాటర్‌ ప్లాంట్ల నీరు తెచ్చి ఇస్తున్నా.. వాటిలో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం ఉంటాయి.. బయట ప్లాంట్లలోని శుద్ధ జలాల్లోని స్వచ్ఛత ఎంత అనేది ప్రశ్నార్థకం. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని తాగించేందుకు, రోగాల బారిన పడకుండా రక్షించేందుకు.. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ఆర్వో ప్లాంట్‌ మరమ్మతులు చేయించి వాటిని వినియోగంలోకి తేవాల్సిన ఆవశ్యకత ఉంది. అధికారులు, పాలకుల పర్యవేక్షణ లోపం.. నిర్లక్ష్యం కారణంగా రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌లు తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గురువారం కనిగిరి పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ బడుగులేరు జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. అస్వస్థకు గురైన 9 మంది విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో విద్యా శాఖ విఫలం చెందడంపై కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మధ్యా హ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ కట్టెలపొయ్యి మీద వండుతామని.. ఈ రోజు మీరు వస్తున్నారనే హడావిడిగా గ్యాస్‌ పొయ్యి మీద వండే సరికి అన్నం వాడిందని సమాధానం చెప్పారు. మెనూ సరిగ్గా లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్‌ రాజాబాబు.. తక్షణం కుకింగ్‌ ఏజెన్సీని తొలగించాలని ఆదేశించారు.

ఆర్వో ప్లాంట్ల మరమ్మతులపై

దృష్టి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైనా బోర్‌ వెల్స్‌ నీటిలో అనుమానం అనిపిస్తే.. తక్షణం వాటర్‌ శాంపిల్స్‌ పరీక్ష చేయిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు పనులకు ఇంకా నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తొలి ప్రాధాన్యతగా వినియోగంలోకి వచ్చే పాఠశాలల ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయిస్తాం. ఆర్వో ప్లాంట్‌ల కోసం ప్రత్యేక గ్రాంట్‌ ఏమీ రాలేదు. దీంతో అనేక పాఠశాలల్లో ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌ల నుంచి బబుల్‌ వాటర్‌ నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు ఇస్తున్నాం.

– శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ డీఈఓ

మూలనబడి1
1/2

మూలనబడి

మూలనబడి2
2/2

మూలనబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement