మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Nov 8 2025 8:00 AM | Updated on Nov 8 2025 8:00 AM

మృత్య

మృత్యువులోనూ వీడని స్నేహం

మృత్యువులోనూ వీడని స్నేహం నక్క దాడిలో చిన్నారికి గాయాలు బైకును ఢీకొట్టిన ఆటో

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

సంఘటనా స్థలంలో ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి

దర్శి: వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మిత్రులు తీవ్ర గాయాలతో మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దర్శి–అద్దంకి రోడ్డులో పోలవరం–వేంపాడు గ్రామాల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. వేంపాడు గ్రామానికి చెందిన చాట్ల వంశీ(18), తన స్నేహితుడు అద్దంకిలోని సంజీవనగర్‌కు చెందిన షేక్‌ సుబానీ(17)తో కలిసి మిషన్‌ మరమ్మతుల కోసం అద్దంకి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఉన్న వీరిని స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఎదురుగా అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన షేక్‌.సుబానీని 108 అంబులెన్స్‌లో అద్దంకి వైద్యశాలకు తరలించే క్రమంలో మార్గ మధ్యంలో మృతిచెందాడు. మతులు ఇద్దరూ దర్శిలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

● ప్రయాణికుల ప్రతిదాడిలో నక్క మృతి

త్రిపురాంతకం: నేషనల్‌ హైవేపై ప్రయాణించేందుకు వేచిఉన్న వారిపై నక్క దాడి చేయడంతో ఓ చిన్నారి గాయపడ్డాడు. ఈ సంఘటన త్రిపురాంతకం మండలం అన్నసముద్రం బస్టాండ్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. బిహర్‌కు చెందిన వలస కార్మికుడు బీరుసుమన్‌ కుమారుడు కుమార్‌పై ఓ నక్క అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచింది. బాలుడిని రక్షించే క్రమంలో నక్కపై స్థానికంగా ఉన్న ప్రయాణికులు రాళ్లతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన చిన్నారికి త్రిపురాంతకంలోని ఓ వైద్యశాలలో చికిత్స అందించారు.

మార్కాపురం: బైకును ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మార్కాపురం మండలంలోని కోలభీమునిపాడు సమీపంలో ముద్దసానమ్మ గండి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. జమ్మనపల్లి నుంచి బైక్‌పై మార్కాపురం వస్తున్న బన్నీ, తేజను జమ్మనపల్లి వైపు వెళ్తున్న ఆటో గండి వద్ద ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులను ప్రైవేట్‌ వాహనంలో స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని రూరల్‌ ఎస్సై అంకమ్మరావు సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మృత్యువులోనూ వీడని స్నేహం 1
1/1

మృత్యువులోనూ వీడని స్నేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement