
చంద్రబాబువి కక్షపూరిత రాజకీయాలు
ఒంగోలు సిటీ: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు కుట్రలు, కక్షపూరిత రాజకీయాలు చేయడం మొదటి నుంచి అలవాటేనని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని విచారణ పేరుతో పిలిచి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన అంతా అక్రమంగా అరెస్ట్‌లు చేయడం, కేసులు పెట్టడంతోనే సరిపోతుందని, పరిపాలన గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి సూపర్‌సిక్స్ పథకాల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల ఊసే చంద్రబాబు ఎత్తడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలోని నాయకుల దోపిడీలు పెరిగిపోయాయని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ 13 నెలల కాలంలో చంద్రబాబు చేసింది శూన్యమని, అరాచకాలు, దోపిడీలు, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెడుతుండటంతో ప్రజా పోరాటాలు చూసి చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతం కావడాన్ని, ప్రజల్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పార్టీలోని ముఖ్యమైన నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాలు, దోపిడీలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు కుట్రలకు వైఎస్సార్ సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవనీ, అయినా ముఖ్యమైన నాయకులందరినీ అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు.
పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి