
శ్రీధర్‌ను పరామర్శించిన మేరుగు
చీమకుర్తి: వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్‌ను మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున మంగళవారం పరామర్శించారు. చీమకుర్తిలోని శ్రీధర్ నివాసంలో పార్టీ నాయకులుతో కలిసి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి వచ్చిన సందర్భంగా పోలీసులు మన్నం శ్రీధర్‌పై అక్రమ కేసులు పెట్టడంతో దాదాపు 6 వారాల పాటు శ్రీధర్‌ను ఒంగోలు జైలులో ఉన్నారు. రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన శ్రీధర్‌ను కలిసి పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, పి.శ్రీమన్నారాయణ, ఏలూరి సురేష్, కుంచాల రాంబాబు, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, తెల్లమేకల గాంధీ, చీదర్ల శేషు, స్థానిక నాయకులు ఉన్నారు.