
రాష్ట్రంలో అరాచక పాలన..!
పొన్నలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సామాన్య ప్రజలపై దాడులు, కేసులు పెడుతూ అరాచక పాలన కొనసాగిస్తుందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొన్నలూరులో మంగళవారం వైఎస్సార్‌సీపీ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ఇచ్చి అధికారం చేపట్టి 13 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశాడన్నారు. సంపద సృష్టిస్తానని రాష్ట్ర సంపందను తన అనుచరులు, పెట్టుబడీదారులకు దోచిపెడుతున్నారన్నారు. అడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెంనాయుడు అనడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శణమన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు. పీ4 పేరుతో మోసపు మాటలు అల్లుతూ చంద్రబాబు అమాయక పేద ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకే గతిలేదని, ఇప్పుడు 2049 విజన్ పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.
ఎల్లో మీడియాలోనే హామీల అమలు....
కూటమి ప్రభుత్వం హామీలన్నీ ఎలో మీడియా, పేపర్లలో కనిపిస్తాయని, ఆచరణలో అవి అమలు కావని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎన్ని రోజులు రాష్ట్రంలో మారణకాండ సృష్టిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్పా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, కానీ కూటమి నేతలు పండించి రవాణా చేస్తున్న గంజాయి పంటకు మాత్రం మంచి ధరలు కల్పిస్తున్నారని విమర్శించారు. 13 నెలల కూటమి పాలనలో రూ, 1.83 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారని విమర్శించారు.
తమ్ముళ్లకే సంక్షేమ శాఖ మంత్రి....
కొండపి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి ఇసుక, మట్టి, బియ్యం దోపిడీలకు పాల్పడుతున్న తెలుగు తమ్ముళ్ల సంక్షేమానికి అండగా నిలుస్తున్నాడు తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమిలేదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి మరి దారుణంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే మంత్రి స్వామి, కూటమి ప్రభుత్వం పనితీరు ఇట్టే తెలుస్తుందన్నారు. జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, పిల్లి తిరుపతిరెడ్డి, మన్నెం చిన్న వెంకటేశ్వర్లు, కాటా మాధవరావు, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, గడ్డం మాల్యాద్రి, కాటా మల్లికార్జున, కనపర్తి గోవిందమ్మ, గుత్తికొండ కళ్యాణి, దారా మాధవరావు, గౌడపేరు విజయ్, కొల్లిపూడి గురుబ్రహ్మం, యర్రా రామకృష్ణ, నూకతోటి ఏడుకొండలు, ఎస్‌కే మస్తాన్‌వలి, పిల్లిపోగు జీవన్‌కుమార్, పచ్చవ వంశీ, గడ్డం వేణుబాబు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం వదిలేసి అక్రమ
కేసులతో వేధింపు
కూటమి ప్రభుత్వ మోసాలను
ప్రతి గడపకు వివరిద్దాం
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు,
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్