ఒంగోలు: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఈనెల 3న జిల్లాలోని 19 సెంటర్లలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లతో డీఈవో వీఎస్ సుబ్బారావు సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 19 సెంటర్లకు 19 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 19 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, మొత్తం 3826 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరని, ఎవరికై నా హాల్ టికెట్ రాకపోతే వారు ముందుగానే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment