
రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న రైల్వే ఇంజినీర్‌లు
● సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన అపుస్మా సంఘం
ఒంగోలు సెంట్రల్: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల గుర్తింపు రెన్యువల్ కాలం మూడు నుంచి 8 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో నంబర్ 90ని విడుదల చేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఒంగోలు ఎంసీఏ భవనంలో మంగళవారం అపుస్మా సంఘ మీడియా సమావేశం నిర్వహించారు. అపుస్మా జోనల్ అధ్యక్షుడు ఏవీ సుబ్బారావు మాట్లాడుతూ ఈ జీవో అనేక ప్రైవేటు పాఠశాలలకు ఉపయుక్తంగా ఉందని, అందుకు సహకరించిన ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రా రెడ్డి, పీ చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతలకు కృతజ్ఞతలు తెలిపారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు కే మాధవరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీల విన్నపంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించి జీవో 90 విడుదల చేశారని, సీఎంతో పాటు అందుకు సహకరించిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘ కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ అపుస్మా సంఘ కృషితో అనేక పాఠశాలలకు ప్రయోజనం చేకూరుతుందని, జీవో ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ అపుస్మా అధ్యక్షుడు నలంద ప్రసాద్, సెక్రటరీ ప్రగతి స్కూల్ పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
నలుగురు ఎస్సైలకు స్థానచలనం
ఒంగోలు టౌన్: నలుగురు ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ ఎస్పీ మలికా గర్గ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీసీపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ కనిగిరికి అటాచ్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ కె.మధవరావును కనిగిరి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. కనిగిరి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న డి.ప్రసాద్ ను జిల్లా వీఆర్‌కు పంపించారు. జిల్లా వీఆర్‌లో ఉన్న జి.కోటయ్యను పీసీపల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. ఒంగోలు వీఆర్‌లో ఉన్న ఆర్.సుమన్‌ను ఒంగోలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు అటాచ్ చేశారు.
సిఫార్సు చేసిన వంగడాలనే వినియోగించాలి
● గుంటూరు హెచ్‌ఓ పొగాకు ప్రొడక్షన్ మేనేజర్ క్రిష్ణశ్రీ
ఒంగోలు సెంట్రల్: పొగాకు బోర్డు అనుమతించిన మేరకు మాత్రమే రైతులు పండించాలని గుంటూరు పొగాకు బోర్డు ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ ఎం క్రిష్ణశ్రీ అన్నారు. పొగాకు బోర్డు ఒంగోలు–2 పరిధిలోని త్రోవగుంట, కరువది, వలేటివారిపాలెం గ్రామాల్లో పొగాకు తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డు ఎంపిక చేసిన వంగడాలను (ఎఫ్‌సీఆర్–15, సిరి) మాత్రమే సాగు చేయాలని చెప్పారు. నాణ్యమైన పొగాకు నారు మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఈ వారం వాతావరణం మబ్బులతో కూడి ఉండటం వలన పచ్చ పురుగు, బొబ్బ తెట్టు వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒంగోలు–2 వేలం కేంద్రం నిర్వహణాధికారి కోవి రామక్రిష్ణ, బోర్డు ఏఎస్‌లు జే తులసి, శంకుతల పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా మార్కాపురం రైల్వే స్టేషన్
మార్కాపురం రూరల్: అమృత్ భారత్‌లో భాగంగా మార్కాపురం రైల్వే స్టేషన్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆసీస్, అరుణ్ అసోసియేట్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఎంఏఆర్ నోయల్, జగన్‌మోహన్‌రావు తెలిపారు. మంగళవారం మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రూపాయలతో మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఉన్న సదుపాయలకన్నా అదనంగా రెండు లిఫ్టులు, ఒక ఎక్సలేటర్, ప్రయాణికుల కోసం ఏసీ వెయిటింగ్ హాల్, రెండో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌ఎస్‌జీ–4 కింద డివిజన్‌లోని మార్కాపురం రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. వీరి వెంట డీఆర్‌యూసీసీ మెంబర్ ఆర్‌కేజీ నరసింహం, నరసింహాచార్యులు ఉన్నారు.

మాట్లాడుతున్న అపుస్మా సంఘ బాధ్యులు