AP: ఖాయంగా తు‘ఫ్యానే’  | YSRCP Will Once Again Make Splash In The General Elections, Says Times Now Survey Report - Sakshi
Sakshi News home page

AP: ఖాయంగా తు‘ఫ్యానే’ 

Mar 9 2024 4:11 AM | Updated on Mar 9 2024 11:17 AM

YSRCP will once again make a splash in the general elections - Sakshi

టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేలో వెల్లడి

21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం 

3–4 ఎంపీ సీట్లకే టీడీపీ–జనసేన కూటమి పరిమితం 

సాక్షి, అమరావతి:  సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టౌమ్స్‌ నౌ – ఈటీజీ రీసెర్చ్‌ సర్వే తేల్చి చెప్పింది. వైఎస్సార్‌ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2 శాతం ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాలు తదితరులు 4 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది.

జీ న్యూస్, రిపబ్లిక్‌ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చా­యి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరాక గతేడాది డిసెంబర్‌ 13 నుంచి ఈనెల 7 వరకూ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను రూపొం­దించినట్లు టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్‌నౌ ఛానెల్‌లో సమర్పించిన సంస్థ సీనియర్‌ న్యూస్‌ ఎడిటర్‌ పద్మజా జోషి వెల్లడించారు.

ఆ అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్సార్‌సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. టీడీపీ–జనసేన పచ్చి అవకాశవాదంతో పొత్తు పెట్టుకున్నాయని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయా­న్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు.   హామీల్లో 99 శాతం అమలు,  సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసనీయత చాటుకున్నారని, వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి ఇదే బాటలు వేస్తున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement