‘ఆ వాయిస్‌ పెద్ద పచ్చ ఫంగస్‌దే.. ఈడీ కూడా తేల్చేసింది’ | YSRCP MP Vijaya Sai Reddy Satirical Tweet On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఆ వాయిస్‌ పెద్ద పచ్చ ఫంగస్‌దే.. ఈడీ కూడా తేల్చేసింది’

May 28 2021 11:56 AM | Updated on May 28 2021 12:37 PM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Tweet On Chandrababu - Sakshi

మనవాళ్లు 'బ్రీఫ్డ్‌ మీ' వాయిస్‌ పెద్ద పచ్చ ఫంగస్‌ దే అని ఈడీ కూడా తేల్చేసింది. అడ్డంగా దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం.. బాబుకు 'వెన్నుపోటు'తో పెట్టిన విద్య

సాక్షి, అమరావతి: ట్విటర్‌ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మనవాళ్లు 'బ్రీఫ్డ్‌ మీ' వాయిస్‌ పెద్ద పచ్చ ఫంగస్‌ దే అని ఈడీ కూడా తేల్చేసింది. అడ్డంగా దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొనడం.. బాబుకు 'వెన్నుపోటు'తో పెట్టిన విద్య’’ అంటూ ఆయన చురకలు అంటించారు. 23 మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను అలానే కొన్నాడు. చేసిన పాపాలు ఊరికే పోవు.. ఇక దేభ్యం ముఖం వేసుకుని దిక్కులు చూడటమే పని’’ అంటూ  ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి దుమ్మెత్తి పోశారు.

గోకుల్‌ పార్క్‌ను సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి..
విశాఖపట్నం: బీచ్ రోడ్డులోని గోకుల్ పార్క్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోకుల్‌ పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పార్కులో శ్రీకృష్ణ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. యాదవుల కోసం నగరంలో సామాజిక భవనాన్ని నిర్మిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

చదవండి: ఓటుకు  కోట్లు కేసు..ఈడీ చార్జిషీట్‌
కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement