ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్‌ రెడ్డి సవాల్‌ | YSRCP MP Mithun Reddy Political Challenge To TDP | Sakshi
Sakshi News home page

ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్‌ రెడ్డి సవాల్‌

Mar 12 2025 1:38 PM | Updated on Mar 12 2025 1:54 PM

YSRCP MP Mithun Reddy Political Challenge To TDP

సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు వైఎస్సార్‌సీపీ లోక్‌సభపక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి. త‍ప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం​ పాలనను గాలికి వదిలేసింది. క్షక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తప్పుడు ఆరోపణలతో మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. లిక్కర్ స్కాం  చేశామని ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయండి. మొదట 50వేల కోట్ల రూపాయల స్కాం అని ప్రచారం చేశారు. ఇప్పుడు మూడువేల కోట్ల రూపాయల స్కాం అని ఆరోపణలు చేస్తున్నారు. మూడువేల కోట్ల రూపాయలు మడిచి జేబులో పెట్టుకుంటారా?.

ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటులో నడిపారు. కానీ, మా ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించింది.  మేము భూములు కబ్జా చేశామని తప్పుడు ఆరోపణలు చేశారు. అఫిడవిట్‌లో కాకుండా, అదనపు భూమి మాకు ఏమైనా ఉంటే చూపించండి. అరెస్టు చేసిన గౌతమ్ తేజ్ వ్యక్తికి పాలీ గ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో కూడా ఆయన నేరం చేయలేదని తేటతెల్లమైంది. వందల మైన్ కాదు ఒక్క మైన్‌లో కూడా అక్రమాలు చూపండి. ఒక్క ఆరోపణకైనా సాక్ష్యం చూపించారా?. మీకు దమ్ముంటే ఆరోపణలను రుజువు చేసి చూపించండి.

ఎర్రచందనం విషయంలోను ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారు. మాపై బురద కొట్టి పారిపోతున్నారు. పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అటవీ భూములు కబ్జా చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబంపైనే 75 ఎకరాల భూమి ఉందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్ చేసిన దర్యాప్తులో కూడా టీడీపీ ఆరోపణలు రుజువు కాలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement