YSRCP MP Margani Bharat Demands Disqualify MP Raghu Rama Krishnam Raju - Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి

Jun 11 2021 3:38 PM | Updated on Jun 11 2021 4:29 PM

YSRCP MP Margani Bharat Demands Disqualify MP Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. 

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే తాము ఆధారాలను లోక్ సభ స్పీకర్‌కు సమర్పించామని భరత్‌ రామ్‌ తెలిపారు. అనేక పర్యాయాలు రఘురామకృష్ణరాజు డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు.

చదవండి: తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement