ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్‌సీపీ నిరసనలకు సిద్ధమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసలను పిలుపునిచ్చింది.
వైఎస్సార్ జిల్లా..
- ఏపీలో ఇంధన, గ్యాస్ కొరతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.
- కేంద్ర పెట్రోల్, సహజవాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను కలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
- ఏపీలో ఏర్పడిన కృత్రిమ కొరత, దానికి గల కారణాలను వివరించిన ఎంపీ
- వెంటనే కేంద్రం కల్పించుకుని ఇంధన, గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని లేఖ
- ఈ కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడి.
- అన్ని రాష్ట్రాల్లో గ్యాస్, ఇంధనాన్ని పూర్తి సామర్ధ్యంతో నిల్వ ఉంచాలని కేంద్రాన్ని కోరిన అవినాష్ రెడ్డి.
- ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని కోరిన ఎంపీ
- ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
- ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీనే పెట్రోల్, డీజిల్ కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరతలేదు.
- ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. సరఫరాదారులతో కుమ్ముక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తోంది.
- కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టాలని కోరిన అవినాష్.
- ప్రజలకు కొరత లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి.
కర్నూలు జిల్లా..
- పెట్రోల్, డీజిల్ కొరతపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఫైర్
- రాష్ట్రంలో చేతకాని పాలన నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు
- పక్క రాష్ట్రంలో లేని ఇంధనం కొరత మన రాష్ట్రంలో ఉండటాన్ని చేతకానితనం కాదంటారా?
- సమృద్ధిగా అన్ని పెట్రోల్ బంకులలో ఇంధనం ఉందని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం
- ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్ళు తెరిచి చూసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- పత్తికొండలో పెట్రోల్ బంకులలో నో స్టాక్ పరిస్థితులపై పరిశీలించిన శ్రీదేవి.
తిరుపతి జిల్లా
- రైల్వే కోడూరులో పెట్రోల్ డీజిల్ ఇక్కట్లు..
- మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసనలు
- వాహనదారులకు మద్దతుగా రానున్న రోజుల్లో భారీ నిరసనలు చేస్తామని ప్రకటన
పశ్చిమగోదావరి జిల్లా
- తాడేపల్లిగూడెంలో బంకుల వద్ద రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన.
- పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు.
- కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్.

విజయవాడ..
- ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..
- కూటమికి ఓట్లు వేసిన వాళ్లను చంద్రబాబు మోసం చేశాడు..
- సామాన్యుడు బాధ పడుతున్నారు..
- రైతులు యూరియా కోసం, పింఛన్ కోసం వృద్ధులు, రేషన్ కోసం మహిళలు, గ్యాస్ కోసం క్యూలో ప్రజలు నిలబడుతున్నారు
- ఓటమి ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుంది..
- చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం..


- ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వలేక పోతుంది..
- చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది..
- ఈరోజు నేను ఆలోచించింది రేపు భారత్ ఆలోచిస్తుంది అని చంద్రబాబు చెపుతున్నాడు..
- మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు..
- జల్సా లకు, డబ్బా కొట్టు రాజకీయాలకు కూటమి నేతలు వున్నారు.
- పెట్రోల్ బంక్ వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజలు ఏ విధంగా బూతులు తిడతారో తెలుస్తుంది..
- జగన్‌ను చూసి పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి
- చేతగానితనాన్ని పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలి..
- పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉంటేగా రేషన్ పద్దతి..
- రైతులు ఇబ్బందులు పడుతున్నారు..
- ఆటో వాళ్ళు, ట్రాక్టర్, రోజు వారి పనులు చేసుకొనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు..

తాడేపల్లి..
నేడు పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలు
గత ఆరు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు కొరత
ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కార్
ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వాహనాలు
కోత మిషన్లు రాక డెల్టాలో నిలిచిపోయిన వరి కోతలు
డీజిల్ లేక 108 సేవలకూ ఆటంకాలు
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు దిగిన వైఎస్సార్‌సీపీ.


