వైఎస్సార్‌సీపీ నేత అనుమానాస్పద మృతి | Ysrcp Leader Munagala Rama Subba Reddy Died Suspicious | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పద మృతి

Jun 27 2025 10:56 AM | Updated on Jun 27 2025 11:52 AM

Ysrcp Leader Munagala Rama Subba Reddy Died Suspicious

సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. మహానంది మండలం మసీదుపురం గ్రామ శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన తల, శరీరంపై దెబ్బలను పోలీసులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నేత వంటెద్దు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.

రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈహత్యలకు కారణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని శిల్పా డిమాండ్ చేశారు. మహానంది పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement