
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.
ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?
రైతుల అవస్థలకు కారణం..
ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్‌లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు.
చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే..
మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు.
