
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో రైతులు పడుతున్న అవస్థలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీసే ప్రయత్నాల గురించి, అలాగే సూపర్ సిక్స్.. సెవెన్ హామీల పేరుతో చేసిన భారీ మోసం గురించి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు.
జగన్ ప్రసంగం హైలైట్స్
వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’
సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే
18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి
అన్నిరకాల పోరాటం చేస్తాం
చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తాం
నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటా
రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం
అయినా బరి తెగిస్తే.. ఊరుకోం
ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం
మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండి
ఉచితం పేరిట..
ఇసుక దోపిడీ నడుస్తోంది
లిక్కర్ మాఫియా నడుస్తోంది
అమరావతి పేరిట మాపియా
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది
చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. దోపిడీకి పరాకాష్ట
అప్పులు ఎగబాకాయి
ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు
సూపర్‌సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు
రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం
చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి

మా హయాంకి వచ్చేసరికి.. 3లక్షల కోట్ల అప్పు చేశాం
ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు చేసిన అప్పుతో ప్రజలకు పథకాలు అందడం లేదు.. మరి ఆ డబ్బు ఎవరికి జేబుల్లోకి వెళ్తోంది?
రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తోంది
వాళ్ల సొంత ఆదాయం పెరుగుతోంది
రాష్ట్రం తిరోగమనంలో ఉంది
ఇచ్చేవి కాక..
జగన్ ఇచ్చినవే కాకుండా.. జగన్ ఇచ్చినవాటికంటే ఎక్కువే ఇస్తా అని చంద్రబాబు వాగ్దానం చేశారు
(ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి బాబు ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పులను ప్రదర్శించారు)
తల్లికి వందనం విషయంలో రూ.15 వేలు ఆంక్షలు లేకుండా ఇస్తామన్నారు? ఏమైంది??
ఎన్నో పథకాలు రద్దు చేశారు
ఐదు లక్షల పెన్షనర్లకు కోత పెట్టింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి కింద రూ.36 వేలు ఇచ్చారా?
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఫ్రీ బస్సు అన్నారు.. ఇది అబద్ధం కాదా?
రూ.3 వేల నిరుద్యోగ భృతి లెక్కన.. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ.72 వేలు బాకీ పడ్డారు
ఉచిత సిలిండర్లలోనూ మాట తప్పారు.. నిజం కాదా?
ఇవన్నీ వాస్తవాలు కావా? మోసాలు కావా?
సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా
అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు
అనంతపూర్‌లో ఇవాళ చేస్తోంది అదే
చంద్రబాబు అబద్ధలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి
ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్

ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్‌టైజ్‌మెంట్లను చూడండి

50 ఏళ్లకే పెన్షన్ తీసేశారు
ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది
నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు
క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా ఎవరికీ అంతుపట్టని రీతిలో సూపర్‌సిక్స్‌లో చేర్చారు
ఇది అట్టర్‌ప్లాఫ్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది
ఆయన పంచిన బాండ్లు పచ్చిమోసమని తేలిపోయింది
వైద్య ఆరోగ్యం ఎంతగా దిగజారిందంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, టెస్టులు లేవు
చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో తురకపాలెం అనే గ్రామం ఉంది
రెండు నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే.. గుర్తించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది
ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్‌లను నాశనం చేశారు
మా హయాంలో చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది




ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం
ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం లేదు
రూ.4500 కోట్ల బకాయికి రూ.600 కోట్లు మాత్రమే చెల్లించారు
ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ కిందకు చేరడం లేదు
చంద్రబాబు పాలనలో వైద్యం ఎంతగా దిగజారిపోయిందనడానికి ఆరోగ్యశ్రీనే నిదర్శనం
నెలకు 300 కోట్ల చొప్పున.. 3,600 కోట్ల ఆరోగ్యశ్రీకి కేటాయించడానికి చంద్రబాబు మనసు రావడం లేదు
ఆరోగ్యశ్రీ, ఆసరా ఏదీ లేదు

చంద్రబాబుకి సిగ్గుండాలి..
ఆలోచన మాది.. ఆచరణ మాది.. భూముల, నిధుల సమీకరణ మాది.. అన్నీ రెడీ
మేం దిగిపోయే నాటికి రూ.3 వేల కోట్ల పనులు జరిగాయి
మిగిలిన రూ.5 వేల కోట్ల పనులకు ఆర్థిక సాయం కూడా వచ్చింది
మరి చంద్రబాబు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు?
ఆ పనులు పూర్తై ఉంటే.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కొన్ని లక్షల మందికి మేలు జరిగేది కదా
వైద్య విద్య కోసం జార్జియా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి మారేది కదా
సిగ్గుండాలి.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి, మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడానికి!!
చంద్రబాబు ఎంత దుర్మార్గుడో ఈ లేఖ ద్వారా..
పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లతో భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి
చంద్రబాబు మాకు ఆ సీట్లు వద్దని లేఖ రాశారు
కేవలం పులివెందుల మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతోనే అలా చేశారు
ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడా?
పేదవాళ్లకు, మధ్యతరగతి మంచి జరుగుతుందటే అడ్డుకుంటారా?
మానవత్వం ఉన్నోడెవడైనా ఇలా చేస్తాడా?
చంద్రబాబు సక్రమంగా పని చేసి ఉంటే.. ఈ ఏడాదిన్నర పాలనలో మరో నాలుగు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యేవి
రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా.. మరో ఆరు కాలేజీలకు చెందిన పనులు దగ్గర పడి ఉండేవి
మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి వాళ్ల కల నెరవేరేది
ఎక్కడ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందో అని.. మెడికల్ కాలేజీల నిర్మాణాలను చంద్రబాబు ఇలా దెబ్బ తీస్తున్నారు

మా హయాంలో..
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
ప్రతీ మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించాం
పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందించాలనుకున్నాం
ఇవి ప్రారంభమైతే.. పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందుతుంది
మా హయాంలో ఒక్కొక్కటిగా తరగతులు ప్రారంభించాయి
అతి తక్కువ టైంలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించాం
ఎన్నికలనాటికీ పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి
మా హయాంలో మొత్తం 17లో ఏడు మెడికల్ కాలేజీలను క్లాస్‌లతో సహా అందుబాటులోకి తెచ్చాం
మేం అధికారంలోకి వచ్చేనాటికి 2,360 సీట్లు ఉండేవి
కొత్త మెడికల్ సీట్ల ద్వారా 2550కు మెడికల్ సీట్లు పెంచే ప్రయత్నం చేశాం
మా హయాంలో 800 సీట్లు కొత్తగా తీసుకొచ్చాం

ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో..
ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది
ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుంది
అందుకే 26 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ఆస్పత్రులు ఉండాలని చూశాం

ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా?
1923 నుంచి 2019 దాకా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి
2019కి ముందుచంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు
మరి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా తీసుకొచ్చారా?
ప్రైవేట్ దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది
ఆ దోపిడీని సామాన్యుడు భరించలేడు
అందుకే ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను బాధ్యతగా తీసుకుంది
ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలలు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు
ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడిపిస్తే.. సామాన్యుడు బస్సు ఎక్కగలడా?
దిగజారి మరీ.. స్కాంలు చేస్తున్నారు
ప్రజల బాగోగుల పట్ల చంద్రబాబుది
సంపద సృష్టి అంటే చంద్రబాబు తన సంపదను పెంచుకోవడమే
సంపద సృష్టిస్తామని చెప్పి.. పప్పుబెల్లాం మాదిరి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారు
కూటమి నేతలు దిగజారి మరీ స్కాంలు చేస్తున్నారు
మా హయాంలో..
ధరల స్థీరీకరణ నిధి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం
మార్కెట్‌లో కాంపీటీషిన్ పెంచి.. ధరలు పెరిగేలా చేశాం
ప్రతీ ఆర్బీకేలో ఈ-క్రాపింగ్ చేశాం
కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.120 వరకు ఉండేది
క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందించాం
కోవిడ్ సమయంలోనూ రైతులను ఆదుకున్నాం
మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది?
ఆర్బీకేలను గాలికొదిలేశారు
ఈక్రాప్‌ను నిర్వీర్యం చేశారు
సున్నావడ్డీ పథకం ఎత్తేశారు
సాయం అందే రైతుల సంఖ్యను తగ్గించేశారు
ప్రతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది
చంద్రబాబుకు చిత్తశుద్ధి అనేది లేదని ఇక్కడే అర్థమవుతోంది
ఎల్లో మీడియా వ్యవహారం ఇలా..
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు లేదు
ఉల్లి, టమాటా, చీనీ రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది
చంద్రబాబు మాత్రం తూతూ మంత్రంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు
చంద్రబాబు చిత్తశుధ్ది ఏంటో ఉల్లిధరలతోనే స్పష్టమవుతోంది
చంద్రబాబు ప్రకటనలు.. ఎల్లో మీడియా సరికొత్త భాష్యాలు

చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే..
మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి
తప్పు చేయాలంటే భయపడేవాళ్లు
అందుకే ఇలాంటివి జరగలేదు
ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు
చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు
ఎవరి మీద చర్యలు లేవు
దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే తీరులో నడుస్తోంది
రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?
రైతుల అవస్థలకు కారణం..
ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు
ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు
అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు
యూరియాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగింది
బ్లాక్‌మార్కెట్ దందాలో చంద్రబాబే భాగస్వామి
రైతులను పీడించి.. స్కామ్‌లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు

గత ఐదేళ్లలో ఇలా ఉండేదా?
మా పాలనలో రైతులు రోడ్డెక్కడం చూశారా?
మా హయాంలో రైతులకు ఇబ్బంది అనేదే లేదు
మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు
అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?
ఇలాంటి పరిస్థితికి.. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి
మరి ఈ పరిస్థితి దేనికి చంద్రబాబు?
రెండు నెలలుగా రైతులు ఎరువులు దొరక్క అగచాట్లు పడుతున్నారు
పగలు రాత్రి తేడా లేకుండా క్యూలైన్లలో నిలబడ్డారు
సీఎం సొంత జిల్లాలోనే రైతులు అగచాట్లు పడుతున్నారు
సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దేనికి?

రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్‌మార్కెట్‌లో స్కాంలకు గురవుతున్నాయి
దీనిని నిరసిస్తూ.. రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీవోలకు అర్జీలు ఇచ్చే కార్యక్రమం చేశాం
వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ.. పోలీసులు అణగదొక్కే ప్రయత్నాలు చేశారు
వైఎస్సార్‌సీపీ నేతలకు ఎక్కడికక్కడే నోటీసులు ఇచ్చారు
రైతులకు మద్దతు ఇవ్వడం తప్పా చంద్రబాబూ?

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?
రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు నిర్వహించడం లేదు
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు