నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Announcement on Padayatra | Sakshi
Sakshi News home page

నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్‌ జగన్‌

Apr 8 2026 1:39 PM | Updated on Apr 8 2026 3:03 PM

YS Jagan Key Announcement on Padayatra

సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్‌తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. 

మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ)  ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

త్వరలో పాదయాత్ర.. వైఎస్ జగన్ క్లారిటీ

Advertisement
 
Advertisement
Advertisement