చైనా భారత్‌లోకి ప్రవేశించినట్టే.. మేం కర్ణాటకలోకి వెళ్తాం.. రౌత్ సంచలన వ్యాఖ్యలు.. 

We Will Enter Karnataka Like China Entered India Sanjay Raut - Sakshi

ముంబై: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంపై శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశించినట్లే తాము కూడా కర్ణాటకలోకి వెళ్తామన్నారు. ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు.

కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని తాము భావించామని, కానీ ఆయనే అగ్గి రాజేసి రెచ్చగొడుతున్నారని రౌత్ విమర్శించారు. ఇటు మహారాష్ట్రలో ప్రస్తుతం బలహీన ప్రభుత్వం అధికారంలో ఉందని, సరిహద్దు వివాదంపై తటస్థంగా ఉంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈమేరకు రౌత్ బుధవారం మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం ఆందోళనకర స్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటివలే చర్చలు జరిపారు. అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు.
చదవండి: జోడో యాత్రపై రాహుల్‌కు కేంద్రం హెచ్చరిక..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top