అటు కూల్చివేత.. ఇటు విశాఖ ఆఫీస్‌కు నోటీసులు | Visakhapatnam YSRCP Office Gets Govt Notice | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌కు నోటీసులు.. చించేసిన గుడివాడ అమర్నాథ్‌

Jun 22 2024 10:49 AM | Updated on Jun 22 2024 12:49 PM

Visakhapatnam YSRCP Office Gets Govt Notice

విశాఖపట్నం, సాక్షి: తాడేపల్లి(గుంటూరు)లో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో చర్యకు ఉపక్రమించింది. విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా నోటీసులు జారీ చేయించింది. ఈ నోటీసుల సంగతి తెలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఆ నోటీసుల్ని చించిపడేశారు.

విశాఖ రూరల్‌ చినగడిలి ఎండాడ వద్ద గత ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభించారు. అయితే.. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ స్థలంలో వీఎంఆర్డీఏ నుంచి అనుమతులతో కార్యాలయం నడిపిస్తున్నారని, ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 

తక్షణమే ఇందులో కార్యకలాపాలు నిలిపివేయాలని, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో జీవీఎంసీ పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను అధికార యంత్రాంగం టార్గెట్‌గా చేసుకుంది. నెల్లూరు పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్‌ అధికారులు వెళ్లినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement