చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్‌కు సంబంధించి టీవీకే అధినేత విజయ్.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్‌కు సంబంధించి అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రధానంగా అభ్యర్థులు గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్‌కే రావాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్ పెట్టాలన్నారు.


