కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజనిVidadala Rajini Strong Warning To Chandrababu Over Betraying Women And Ignoring Super Six Promises | Sakshi
Sakshi News home page

Vidadala Rajini: కేసులకు, బెదిరింపులకు భయపడం

May 31 2026 2:55 PM | Updated on May 31 2026 4:39 PM

Vidadala Rajini Strong Warning to Chandrababu

సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్‌ సిక్స్‌ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన మెడికల్‌ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement