వ్యవసాయ బిల్లులు: నిరంతరం ఉద్యమాలు..

Uttam Kumar: Protests In Telangana Against Agriculture Bills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రం చేసిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని టీపీసీసీ ఛైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి‌ వెల్లడించారు. రైతులను తీవ్రంగా నష్టం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విదంగా బిల్లులు రూపొందించారని విమర్శించారు. మార్కెట్ యార్డు బయట కూడా వ్యయసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వ్యాపారులపై నియంత్రణ ఉండదని అన్నారు. ఉత్పత్తుల అమ్మకాలను ఎక్కడైనా అమ్ముకోవడం, నిత్యావసర వస్తువుల స్టాక్ లో నియంత్రణ లేకుండా చేయడం లాంటి బిల్లుల వల్ల దేశంలో రైతులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. చదవండివ్య‌వ‌సాయ బిల్లు ..కార్పోరేట్ బిల్లులా ఉంది

బ్లాక్ మార్కెట్ పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు చాలా నష్టపోతారని తెలిపారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఈ విషయాలపై ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణలో వరస ఉద్యమాలను చేపట్టామని ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. ‘నిన్న మల్లికార్జున్ ఖర్గే  ఇక్కడ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి బిల్లులపై మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పీకప్ ఆఫ్ అగ్రికల్చర్ సోషల్ మీడియా కంపైన్ చేశారు. 28న ప్రదర్శన నిర్వహించి గవర్నర్‌ను కలిసి బిల్లులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇంకా వరస కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని విజయవంతం చేస్తాం’. అని పేర్కొన్నారు. (దసరా రోజున ధరణి పోర్టల్‌: సీఎం కేసీఆర్‌)

తామంతా కలిసి టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఏఐసీసీ ఇంఛార్జి మనిక్కమ్‌ ఠాగూర్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, కలిసి ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమన్నారు. ప్రతి నెలలో రెండుసార్లు తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, అన్ని విషయాలు చర్చించుకుందామన్నారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడ వచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపిన్చారు. సెప్టెంబర్ 28న గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేయాలన్నారు .అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలని, ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయవంతం చేయాలని కోరారు. (భారీ వర్షాలు: నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో)

‘అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులతో సంతకాల సేకరణ చేయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి. కేసీఆర్ ఈ బిల్లుల విషయంలో తెలివిగా ఆటలాడుతున్నారు. అన్ని బిల్లుల విషయంలో అందరికంటే ముందుగానే బీజేపీకి, మోడీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. మనం రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేయాలి.. ప్రజల్లో పోరాటాలు, క్షేత్ర ఉద్యమాలతో జనం మధ్య ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సోనియమ్మ త్యాగంతోనే తెలంగాణ సాధ్యం అయ్యింది. ఆ త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇవ్వాలి’. అని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top