 
													న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బంగారు కూలి పేరుతో టీఆర్‌ఎస్ నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీకి గతంలోనే ఫిర్యాదు చేశారు రేవంత్.
దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు అప్పుడే లేఖ పంపింది ఈసీ. అయితే ఈ విచారణ పూర్తి కాకుండానే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళే(సోమవారం) విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.
 చదవండి: సీవీ ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరా?.. ఓ పార్టీ కార్యకర్తా?: రేవంత్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
