‘పేదల కోసం పనిచేసే పార్టీ మాది’ | TPCC Chief Mahesh Kumar Goud Praises Congress Party | Sakshi
Sakshi News home page

‘పేదల కోసం పనిచేసే పార్టీ మాది’

Apr 7 2026 8:59 PM | Updated on Apr 7 2026 9:02 PM

TPCC Chief Mahesh Kumar Goud Praises Congress Party

మహబూబ్‌నగర్‌: గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రేస్ అదికారంలోకి వచ్చిన 3 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తప్పుడు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారని,

రేవంత్  కోట్ల రూపాయల విదేశి పెట్టుబడులు తీసుకొచ్చారని, కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్‌లో పదవులు వస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో  ఆర్దిక విద్వంసం జరిగిందని, అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకంగా పనులు చేయటం వల్ల కూలేశ్వరంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మహేష్‌కుమార్‌ గౌడ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement